సూర్య సినిమా నుంచి సెకండ్ లుక్!

  • ఈ రోజున సూర్య పుట్టినరోజు
  • 40వ చిత్రం 'ఎతరుక్కుమ్ తునింధవన్' 
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
  • ఆసక్తి కలిగిస్తున్న తాజా పోస్టర్  
కోలీవుడ్లో కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో సూర్య ఒకరు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రమైన 'ఎతరుక్కుమ్ తునింధవన్' నుంచి సెకండ్ లుక్ ను వదిలారు. ఈ సినిమా టీమ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శత్రువులను ఖడ్గంతో అంతమొందించి, ఆ శవాల గుట్టల పక్కన ఆవేశంతో రగిలిపోతూ ఆయన కూర్చున్న ఈ పోస్టర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథనాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకి అక్కడ మంచి పేరు ఉంది. యథార్థ సంఘటనల నుంచి కథలను తీసుకోవడం .. సహజత్వంతో ఆ కథలను తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి పాండిరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కెరియర్ పరంగా చూసుకుంటే సూర్యకి ఇది 40వ సినిమా. ఇంతవరకూ సూర్య చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. ఈ సినిమాలో సూర్య జోడీగా 'ప్రియాంక అరుళ్ మోహన్' అలరించనుంది. తెలుగులో 'నానీస్ గ్యాంగ్ లీడర్' .. 'శ్రీకారం' చేసిన ప్రియాంక అరుళ్ మోహన్, ఇప్పుడు తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ సినిమాతో అక్కడ ఆమె బిజీ కావడం ఖాయమని అంటున్నారు. 


More Telugu News