పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రత్యేక చర్చ చేపట్టేవరకు పోరాడుతాం: వైసీపీ ఎంపీ భరత్

  • కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • పలు అంశాలపై వైసీపీ ఎంపీల పోరు
  • పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించాలన్న భరత్
  • చంద్రబాబు సొంత ప్యాకేజీకి ఒప్పుకున్నాడని ఆరోపణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ప్రత్యేకహోదా, విభజన హామీలు, పోలవరం అంశాలపై నిత్యం వైసీపీ ఎంపీలు ఎలుగెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రత్యేక చర్చ చేపట్టేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టులో పరిహారం, పునరావాసం సహా సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేబీకే తరహా ప్యాకేజీని ఏపీకి అమలు చేయాలని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే కష్టాలు వచ్చాయని విమర్శించారు. సొంత ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.


More Telugu News