హుజూరాబాద్‌లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పోటీ: ఆర్.కృష్ణయ్య

  • తొలగించిన 7600 మందిని విధుల్లోకి తీసుకోవాలి
  • ధర్మదీక్షలో కేసీఆర్‌కు కృష్ణయ్య హెచ్చరిక
  • 24న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం
తొలగించిన గ్రామీణ ఉపాధిహామీ క్షేత్ర సహాయకులను రెండు వారాల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే హుజూరాబాద్‌లో వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలోకి దిగుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి కృష్ణయ్య నిన్న హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద ధర్మదీక్ష చేపట్టారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమన్నారు. ఏ తప్పు చేశారని వారిని తొలగించారో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణచివేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News