ఇక కంపోస్టబుల్ ఎకోలాస్టిక్ సంచుల్లో శ్రీవారి ప్రసాదం

  • ఎకో ఫ్రెండ్లీ సంచులు తయారుచేసిన బెంగళూరు డీఆర్‌డీవో
  • కూరగాయల వ్యర్థాలతో తయారీ
  • రూ. 2, రూ. 5 చొప్పున ధరల నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని కంపోస్టబుల్ ఎకోలాస్టిక్ సంచుల్లో అందించనున్నారు. ఐదు లడ్డూలు పట్టే సంచిని 2 రూపాయలకు, పది చిన్న లడ్డూలు లేదంటే మూడు పెద్ద లడ్డూలు పట్టే మధ్యరకం సంచికి రూ. 5 చొప్పున ధరలు నిర్ణయించారు.

ఈ సంచులను బెంగళూరు డీఆర్‌డీవో ఎకోలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అభివృద్ధి చేసింది. కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థాలతో వీటిని తయారు చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిన్న ఈ సంచులను శ్రీవారి చెంత ఉంచిన సంస్థ ప్రతినిధులు స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలోనే భక్తులకు ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


More Telugu News