వైయస్సార్ కాపు నేస్తం నిధులను రేపు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం
- లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్న జగన్
- వరుసగా రెండో ఏడాది నిధులను విడుదల చేస్తున్న ప్రభుత్వం
- 3,27,244 మంది పేదలకు లబ్ధి
కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. అన్ని పథకాల లబ్ధిదారులకు కచ్చితంగా డబ్బు జమ చేస్తోంది. తాజాగా వైయస్సార్ కాపు నేస్తం నిధులను వరుసగా రెండో ఏడాది విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రేపు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా సీఎం డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం వైసీపీ ప్రభుత్వం రూ. 490.86 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఏడాదికి రూ.15,000 చొప్పున ఐదేళ్లలో రూ.75,000 సాయాన్ని ఒక్కొక్కరికి అందించనుంది.