మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదు

  • స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ప్రవీణ్ కుమార్
  • హిందూ దేవతలను అవమానించారంటూ అభియోగాలు
  • కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి హిందూ దేవతలను అవమానించారన్న అభియోగాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో హిందూ దేవతలను కించపరిచేలా విద్యార్థులతో ప్రవీణ్ ప్రతిజ్ఞ చేయించారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా కరీంనగర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కరీంనగర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. 

కాగా, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గురుకుల బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది.


More Telugu News