భక్తుల విజ్ఞప్తికి ప్రభుత్వం ఓకే.. అర్చకుల శాశ్వత నియామకంపై కమిటీ ఏర్పాటు
- ఏకసభ్య కమిటీ చైర్మన్‌గా జస్టిస్ శివశంకర్‌రావు
- వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై కమిటీ అధ్యయనం
- మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం, భక్తుల విజ్ఞప్తులపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు తరహాలో అర్చకుల శాశ్వత నియామకానికి సంబంధించి కార్యచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా టీటీడీ వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జుడీషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ శివశంకర్‌రావును నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.