ప్రాధాన్యత లేని పదవులను బలహీనవర్గాలకు ఇచ్చారు: అచ్చెన్నాయుడు
- వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు
- దీనిపైనే జగన్ శ్రద్ధ పెట్టారు
- బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి
- అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రాధాన్యత లేని పదవులను బలహీనవర్గాలకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపైనే జగన్‌కు శ్రద్ధ ఉందని, విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని ఆయన అన్నారు.
నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లను జగన్ సొంత సామాజిక వర్గానికి ఇచ్చారని ఆయన ఆరోపణలు గుప్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులను డమ్మీలుగా చేశారని ఆయన అన్నారు. చివరకు నామినేటెడ్ పదవుల్లోనూ వివక్ష చూపించారని అన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ఆయన పాలనలో బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటూ సామాజిక ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.