కరోనా మరణాల లెక్కలను సవరించిన మహారాష్ట్ర.. మరో 3,509 మరణాలు

  • మరణాల రేటు 2.09గా వెల్లడి
  • కేసుల్లోనూ 2,479 పెరుగుదల
  • దేశంలో మొత్తం మరణాలు 4.18 లక్షలు
కరోనా మరణాల గణాంకాలను మహారాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కరోనా కేసులు, మరణాలకు సంబంధించి 14వ పున:సమీక్షలో భాగంగా.. మరో 3,509 మరణాలను జాబితాలో చేర్చింది. అంతేగాకుండా 2,479 కేసులను లిస్టులో పెట్టింది. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,18,480కి పెరిగినట్టయింది. మహారాష్ట్ర మరణాల సవరణలను కలిపి నిన్న కొత్త మరణాలు 3,998గా కేంద్రం ప్రభుత్వం ఇవ్వాళ వెల్లడించింది.  

కాగా, మంగళవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన బులెటిన్ లో మరణాల లెక్కల సవరణ వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. బులెటిన్ ప్రకారం నిన్న రాష్ట్రంలో 6,910 కొత్త కేసులు, 147 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 2.09గా ఉంది. ప్రస్తుతం ఇంకా 94,593 యాక్టివ్ కేసులున్నాయి.


More Telugu News