తగ్గేది లేదంటున్న 'టక్ జగదీశ్'!
- శివ నిర్వాణ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
- నాని సరసన నాయికగా రీతూ వర్మ
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- థియేటర్లలోనే భారీ విడుదల
తెలుగులో రవితేజ తరువాత ఆ స్థాయి దూకుడు చూపించే హీరోగా నాని కనిపిస్తాడు. ఏడాదికి మూడు సినిమాలైనా చేయాలనే పట్టుదలతో ఆయన ముందుకు వెళుతుంటాడు. అలా ఈ ఏడాదికి కూడా ఆయన మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఆ జాబితాలో మొదటి సినిమాగా 'టక్ జగదీశ్'ను ఈ ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరిగిపోయాయి. కానీ కరోనా ముంచుకురావడంతో విడుదల కాలేదు. ఆ సమయంలో వెనక్కి వెళ్లిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఉంది.
షైన్ స్క్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దర్శక నిర్మాతలు అలాంటిదేం లేదని స్పష్టం చేశారు. కానీ 45 కోట్ల ఆఫర్ రావడంతో, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా మళ్లీ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తారట. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ కానుందట.