జాతీయస్థాయి సీరో సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి

  • ఏడాదిన్నర కాలంగా దేశంలో కరోనా విజృంభణ
  • 3 కోట్ల మందికి పైగా కరోనా బాధితులు
  • 4 లక్షల మందికి పైగా మృతి
  • నాలుగో సీరో సర్వే చేపట్టిన ఐసీఎంఆర్
గత ఏడాదిన్నర కాలంగా దేశాన్ని కరోనా రక్కసి పట్టిపీడిస్తోంది. ఇప్పటిదాకా 3.12 కోట్ల మందికి సోకిన ఈ మహమ్మారి 4.14 లక్షల మందిని బలిదీసుకుంది. దేశంలో ఓవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, సమాంతరంగా కరోనా వ్యాప్తి కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేపట్టిన సీరో సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

జాతీయస్థాయిలో ఓవరాల్ గా 67.6 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనిపించినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. వయసుల వారీగా చూస్తే... 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 50 శాతం, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 77.6... ఇక 60 ఏళ్లకు పైబడిన వారిలో 76 శాతం యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడించింది.

కాగా, తాజా అంచనాల నేపథ్యంలో మరో 40 కోట్ల మంది కరోనా బారినపడే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇది ఐసీఎంఆర్ చేపట్టిన నాలుగో జాతీయస్థాయి సర్వే.


More Telugu News