శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
- రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు
- శ్రీశైలం డ్యామ్ కు 1,64,645 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- ప్రస్తుత నీటి మట్టం 833.40 అడుగులు
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు 1,64,645 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 53.1795 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్ నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 833.40 అడుగులుగా ఉంది. మరోవైపు తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.