ఒక హీరో నన్ను వర్షంలో నిలబెట్టాడు: దర్శకుడు ప్రశాంత్ వర్మ

  • ఓ హీరో ఇంటికి వెళ్లాను
  • లోపలే ఉండి కూడా రమ్మనలేదు
  • వానలో తడిసిపోయాను
  • ఎప్పటికే మరిచిపోలేను
చిత్రపరిశ్రమలో దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే ఎంతో సహనం .. ఓర్పు కావాలి. ఏ హీరో అయినా దర్శకుడిపై నమ్మకంతోనే సినిమాను ఒప్పుకుంటాడు. నిర్మాతలు కూడా దర్శకుడిపై గల నమ్మకంతోనే డబ్బులు పెడతారు. అందువలన వాళ్లను ఒప్పించడం దర్శకులకు ఒక సవాలు వంటిదే అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకులకు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. తాను కూడా అందుకు మినహాయింపు కాదని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఒక హీరో చాలా కఠినంగా ప్రవర్తించాడంటూ ఆ సంగతి చెప్పుకొచ్చాడు.

"నేను ఒక హీరోకు కథ చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లాను. ముందుగా ఆయనకి కాల్ చేసి రమ్మంటేనే వెళ్లాను. ఆయన ఇంటిదగ్గరికి చేరుకోగానే అనుకోకుండా పెద్ద వర్షం మొదలైంది. దాంతో నేను గేటు బయటే ఉండి ఆయనకి కాల్ చేసి .. నేను వచ్చినట్టు చెప్పాను. అయినా ఆయన వెంటనే లోపలికి రమ్మనకుండా నన్ను ఆ వర్షంలో అలాగే వెయిట్ చేయించాడు. నేను ఆ వర్షంలో తడిసిపోతూ, ఆయన ఇంటివైపే చూస్తూ నిలబడ్డాను. కిటికీలో నుంచి నన్ను ఆయన చూస్తుండటం నేను అప్పుడు గమనించాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూ, బాధను కలిగిస్తూనే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News