కొవిడ్ నుంచి కోలుకున్నాక 9 నెలలపాటు యాంటీబాడీలు: తాజా అధ్యయనం

  • లక్షణాలు ఉన్నా, లేకున్నా యాక్టివ్‌గానే యాంటీబాడీలు
  • 2 వేల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడి
  • లండన్, ఇటలీ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీలు 9 నెలలపాటు క్రియాశీలంగా ఉంటాయని తాజా అద్యయనంలో గుర్తించారు. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ లండన్, ఇటలీలోని పాడువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా బారినపడిన వ్యక్తుల్లో ఆ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకున్నా వారిలో యాంటీబాడీలు 9 నెలలపాటు మనుగడలో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వైరస్ బారినపడి కోలుకున్న ఇటలీలోని ఓ పట్టణానికి చెందిన 2 వేల మందిని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. లక్షణాలు ఉన్న వారితోపాటు, లేనివారిలోనూ 9 నెలలపాటు యాంటీబాడీలు క్రియాశీలంగా ఉండడాన్ని తాము గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.


More Telugu News