కళకళలాడుతున్న అమెరికా విమానాశ్రయాలు.. లక్షలాదిమందితో కిటకిట
- ఆదివారం ఒక్కరోజే 22 లక్షలమందికిపైగా ప్రయాణికుల స్క్రీనింగ్
- నెమ్మదిగా కుదుట పడుతున్న దేశీయ విమానయాన రంగం
- అంతర్జాతీయ ప్రయాణాలపై కొనసాగుతున్న ఆంక్షలు
కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికాలో నెమ్మదిగా కరోనా ముందునాటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత విమానాశ్రయాలు మళ్లీ ప్రయాణికులతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహారయాత్రలకు ప్రజలు ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ కలిపి 22 లక్షలమందికి పైగా ప్రయాణికుల స్క్రీనింగ్ జరిగినట్టు అమెరికా రవాణా భద్రతా విభాగం తెలిపింది. ఈ స్థాయిలో ప్రయాణికులు స్క్రీనింగ్ కావడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది. అయితే, అంతకుముందు ఏడాది (2019) ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువని తెలిపింది.
మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండడంతో ఆ ప్రభావం విమానయాన సంస్థలపై భారీగానే ఉంది. దేశీయంగా విమాన ప్రయాణాలు మునుపటి స్థాయికి చేరుకుంటున్నా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షల కారణంగా విమానయాన సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి.