ఇది అలాంటి ఇలాంటి సారె కాదండోయ్... లారీలకు లారీలు పంపారు!

  • కుమార్తెకు సారె పంపిన రాజమండ్రి వ్యాపారి
  • సారె లిస్టులో చేపలు, రొయ్యలు, స్వీట్లు, ఆవకాయ 
  • లారీలు, జీపుల నిండా వెళ్లిన సారె వస్తువులు
  • రాజమండ్రి నుంచి యానం వరకు ఊరేగింపు
రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారి బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి.. యానాంకు చెందిన వ్యాపారవేత్త తోటరాజు కుమారుడు పవన్ కుమార్ కు ఈ ఏడాది జూన్ లో ఘనంగా వివాహం జరిగింది. ఇంతలో ఆషాఢం రావడంతో బలరామకృష్ణ కుమార్తెకు సారె పంపారు. సారె అంటే అలాంటి ఇలాంటి సారె కాదు... తరతరాలు చెప్పుకునేలా ఘనంగా పంపారు. ఈ సారెను తీసుకుని కొన్ని లారీలు, జీపులు యానాంకు తరలి వెళ్లాయి.

ఇక ఆ లిస్టు చదివితే మతిపోవడం ఖాయం. 100 రకాల మిఠాయిలు, 10 మేకపోతులు, టన్ను పండుగప్ప చేపలు, టన్ను కొరమేను చేపలు, 250 కేజీల బొమ్మిడాయిలు, 350 కేజీల రొయ్యలు, 50 పందెంకోళ్లు, బిందెలకొద్దీ తినుబండారాలు, పలు రకాలు ఫలాలు, 250 రకాల కిరాణా సామాన్లు, 200 జాడీల ఆవకాయ, టన్ను కూరగాయలు పంపారు. వీటిని రాజమండ్రి నుంచి ఊరేగింపుగా యానాం తీసుకెళ్లి తన కుమార్తె మెట్టినింట దింపారు.


More Telugu News