ఎస్ఈసీ నీలం సాహ్నీపై దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల 23కి వాయిదా

  • ఇటీవల ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకం
  • వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
  • ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదన్న ఎస్ఈసీ న్యాయవాది
  • డివిజన్ బెంచ్ కు బదలాయించాలని విజ్ఞప్తి
ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అందుకే ఈ విచారణను డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల కమిషనర్ అంశాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని పేర్కొంది.

ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందికి వస్తుందని గతంలో పలు తీర్పులు ఉన్నాయని వెల్లడించారు. అయితే, గత తీర్పులను ఫైల్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.


More Telugu News