అమరావతి భూములపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు
- గతంలో ఆరోపణలను తిరస్కరించిన హైకోర్టు
- సుప్రీంకు వెళ్లిన ఏపీ సర్కారు
- ఇవాళ్టి విచారణలో తీవ్రస్థాయి వాదోపవాదాలు
- సర్కారుకు ఎదురుదెబ్బ
అమరావతి భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
గతంలో ఏపీ హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తిరస్కరించడంతో, ఆ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇవాళ్టి విచారణలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించకపోగా, సర్కారు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.