అందుకే ప‌శ్చిమ బెంగాల్‌లో ఓడిపోయాం: సొంత పార్టీపై బీజేపీ నేత సువేందు వ్యాఖ్య‌లు

  • తొలి రెండు విడతల పోలింగ్‌లో బీజేపీకి  భారీగా మద్దతు
  • ఈ కార‌ణంగానే బీజేపీ నేత‌లు కొంద‌రు అతి విశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారు
  • బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుచుకుంటుందనుకున్నారు
  • క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిర్లక్ష్యం
ప‌శ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఓడించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల ముందు తృణ‌మూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి మాత్రం మ‌మ‌త బెన‌ర్జీపై ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఓట‌మిపై ఆయ‌న స్పందిస్తూ సొంత పార్టీ నేత‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తొలి రెండు విడతల పోలింగ్‌లో బీజేపీకి  భారీ మద్దతు లభించిందని ఆయ‌న చెప్పారు. ఈ కార‌ణంగానే బీజేపీ నేత‌లు కొంద‌రు అతి విశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారని ఆయ‌న విమర్శించారు. బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుచుకుంటుందనుకున్నార‌ని, దీంతో క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిర్లక్ష్యం వహించారని, అందుకే బీజేపీ ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు.  

ఆయ‌న‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్ స్పందిస్తూ బీజేపీ ఓటమికి సువేందు ఇతరుల్ని ఎందుకు బాధ్యుల్ని చేస్తున్నారని నిల‌దీశారు. బీజేపీనే గెలుస్తుంద‌ని సువేందు కూడా ప‌గ‌టి క‌ల‌లు క‌న్నార‌ని చుర‌క‌లంటించారు.


More Telugu News