ఇష్టంలేని పెళ్లి చూపులతో మానసిక ఆందోళన.. కానిస్టేబుల్ ఆత్మహత్య
- నగరంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆంజనేయులు
- తల్లి స్వస్థలానికి వెళ్లడంతో ఉరివేసుకుని ఆత్మహత్య
- ఆంజనేయులుది అనంతపురం జిల్లాలోని కదిరి
తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు తీసుకెళ్లారన్న మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన దండగల ఆంజనేయులు (25) ఏఆర్ కానిస్టేబుల్. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చిన ఆంజనేయులు తల్లి లక్ష్మితో కలిసి కార్ఖానాలోని న్యూవాసవి నగర్‌లో ఉంటున్నాడు.
ఆంజనేయులు వద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోని కుటుంబ సభ్యులు ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిపించారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనతో గడుపుతున్న ఆంజనేయులు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పింఛను తీసుకునేందుకు తల్లి లక్ష్మి శుక్రవారం కదిరి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానిక విక్రంపురి కాలనీలో ఉండే ఆంజనేయులు సోదరి శనివారం ఫోన్ చేసి మాట్లాడింది. తనకు నైట్ డ్యూటీ ఉందని ఆమెకు చెప్పాడు. అదే రోజు రాత్రి మళ్లీ ఆమె ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో అనుమానించిన ఆమె.. నిన్న ఉదయం తనకు సోదరుడి వరుసైన క్రాంతిని పంపించింది. ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానించిన క్రాంతి స్థానికుల సాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా ఆంజనేయులు లోపల ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.