తాండూరుకు మొదలైన ప్యాసింజర్ రైళ్ల తాకిడి.. 16 నెలల తర్వాత సేవలు షురూ!

  • వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులోకి వచ్చిన ప్యాసింజర్ రైళ్లు
  • ఉదయం 6 గంటలకు తాండూరు చేరుకున్న సికింద్రాబాద్-కలుబురిగి రైలు
  • 9 గంటలకు మరో రైలు
కరోనా లాక్‌డౌన్ కారణంగా గతేడాది నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్ల సేవలు దాదాపు 16 నెలల తర్వాత నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్యాసింజర్ రైళ్లను పట్టాలెక్కిస్తున్నట్టు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఇందులో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్ సహా ఏపీలోని గుంటూరు, విజయవాడ, కడప తదితర ప్రాంతాల నుంచి 60కిపైగా ప్యాసింజర్ రైళ్లు కూతకు రెడీ అయ్యాయి. ఈ ఉదయం 8.50 గంటలకు ఫలక్‌నుమా నుంచి వాడీ వెళ్లే రైలు తాండూరుకు చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి కలుబురిగి వెళ్లే రైలు ఉదయం 5.58 గంటకు తాండూరు చేరుకుంది.

కరోనా కారణంగా రైళ్ల సేవలు ఆగిపోవడంతో నిత్యం హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే తాండూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, కూలీలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, శంకర్‌పల్లి, సేడం, గుల్బర్గా వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి రావడంతో వీరి కష్టాలు తీరినట్టే.


More Telugu News