అమరీందర్ అభ్యంతరాలు బేఖాతరు.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ
- సిద్ధూను పీసీసీ చీఫ్‌ను చేయవద్దంటూ సోనియాకు అమరీందర్ లేఖ
- పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు అన్యాయమైపోతారని ఆవేదన
- సిద్ధూను పీసీసీ చీఫ్‌గా, మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు
పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సిద్ధూకు పీసీసీ పదవి ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన అమరీందర్.. సోనియాకు లేఖ రాస్తూ సిద్ధూను పీసీసీ పీఠంపై కూర్చోబెడితే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఆయన అభ్యంతరాలను పక్కనపెట్టిన సోనియా గాంధీ తాజాగా సిద్ధూను పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ గత రాత్రి ప్రకటించారు. ఆయనతోపాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.