బెజవాడ దుర్గమ్మ కోసం తెలంగాణ నుంచి తరలివచ్చిన బోనాలు

  • గత 12 ఏళ్లుగా ఆనవాయితీ
  • ఏపీకి బోనం తెస్తున్న భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
  • తాజాగా విజయవాడకు తెలంగాణ బృందం రాక
  • ఘనస్వాగతం పలికిన దుర్గగుడి వర్గాలు
తెలంగాణలో గత ఆదివారం నుంచి బోనాలు షురూ అయిన సంగతి తెలిసిందే. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కాగా, ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనం తరలివచ్చింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నేతృత్వంలో దుర్గమ్మ తల్లి కోసం హైదరాబాద్ నుంచి బోనం తీసుకువచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి భక్తిప్రపత్తులతో బోనం సమర్పించారు.

కాగా, తెలంగాణ నుంచి వచ్చి బోనాల బృందానికి దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు ఘనస్వాగతం పలికారు. గత 12 ఏళ్లుగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆంధ్రప్రదేశ్ లోనూ బోనాల వేడుక నిర్వహిస్తోంది.


More Telugu News