అక్రమంగా కరోనా ఔషధాలు నిల్వ చేసిన వ్యవహారంలో గంభీర్ ఫౌండేషన్, ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు

  • ఇటీవల దేశంలో కరోనా సెకండ్ వేవ్
  • మందులు, ఆక్సిజన్ పంపిణీ చేసిన గంభీర్, తదితరులు
  • విచారణ షురూ చేసిన ఔషధ నియంత్రణ సంస్థ
  • చిక్కుల్లో గంభీర్ ఫౌండేషన్, ఆప్ ఎమ్మెల్యేలు
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఢిల్లీలో మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు చెందిన ఫౌండేషన్ కరోనా మందులు, మెడికల్ ఆక్సిజన్ ఉచితంగా పంపిణీ చేసింది. ఆప్ ఎమ్మెల్యేలు ఇమ్రాన్ హుస్సేన్, ప్రవీణ్ కుమార్ కూడా ఇదే తరహాలో కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను, మెడికల్ ఆక్సిజన్ ను ప్రజలకు అందజేశారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఫౌండేషన్ తో పాటు ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలపైనా కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ ఇవాళ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.

సెకండ్ వేవ్ సమయంలో అక్రమంగా కరోనా ఔషధాలు కలిగి ఉన్నందుకు గంభీర్ ఫౌండేషన్ ట్రస్టీలు, సీఈవోపైనా, ఆప్ ఎమ్మెల్యేలు ఇమ్రాన్ హుస్సేన్, ప్రవీణ్ కుమార్ లపైనా విచారణ షురూ చేసినట్టు వెల్లడించింది. లైసెన్స్ లేకుండా ఔషధాల తయారీ, అక్రమంగా కలిగివుండడం, అక్రమ అమ్మకాలకు పాల్పడితే మూడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఈ నేపథ్యంలో, గంభీర్ ఫౌండేషన్, ఆప్ ఎమ్మెల్యేలకు కష్టాలు తప్పేలా లేవు.


More Telugu News