లంక టాపార్డర్ ను కట్టడి చేసిన టీమిండియా స్పిన్నర్లు

  • కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు
  • 26 ఓవర్లలో 4 వికెట్లకు 120 రన్స్ చేసిన లంక
  • కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు
తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు శ్రీలంక టాపార్డర్ ను కట్టడి చేశారు. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య లంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆవిష్క ఫెర్నాండో (32), మినోద్ భానుక (27) తొలి వికెట్ కు 49 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఈ జోడీని లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విడదీశాడు. ఫెర్నాండోను అవుట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా విజృంభించి మరో ఓపెనర్ మినోద్ భానుకను పెవిలియన్ చేర్చాడు.

అనంతరం, భానుక రాజపక్స వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. అయితే కుల్దీప్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధనంజయ డిసిల్వా 14 పరుగులు చేసి కృనాల్ పాండ్య బౌలింగ్ లో వెనుదిరగడంతో లంక 117 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. చరిత్ అసలంక, కెప్టెన్ దసున్ షనక క్రీజులో ఉన్నారు.


More Telugu News