మూడు రాజధానులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
- మూడు రాజధానుల నిర్ణయం చెల్లదన్న రఘురామ
- విభజన చట్టాన్ని అసెంబ్లీలో సవరించారని వెల్లడి
- పార్లమెంటులో సవరిస్తేనే చట్టబద్ధత అని ఉద్ఘాటన
- ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన లేఖల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా, మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేశారని, అది చెల్లదని పేర్కొన్నారు.
విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నానని అమిత్ షాకు రాసిన లేఖలో రఘురామ వివరించారు. ఇటీవల జలవివాదాన్ని పరిష్కరించినట్టే, 3 రాజధానుల అంశాన్ని కూడా కేంద్రమే పరిష్కరించాలని కోరారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ... రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక దుస్థితి ఏపీలో ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.