సంక్షేమానికి, జీతాల‌కు అప్పులపైనే ఆధార‌ప‌డుతున్నారు: య‌న‌మ‌ల‌

  • ప‌రిపాలించే ప్ర‌ధాన ప‌ద‌వుల్లో సొంతవారిని పెట్టుకున్నారు
  • స‌ల‌హాదారుల పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌లు దుబారా చేస్తున్నారు
  • ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల పేరుతో దోపిడీకి సిద్ధ‌మ‌య్యారు
  • ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రాసి, రాచ‌రిక వ్య‌వ‌స్థ‌ను విస్త‌రిస్తున్నారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డానికి, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డానికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులపైనే ఆధార‌ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ద‌ళిత వ్య‌తిరేక ప్ర‌భుత్వమ‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో ప‌రిపాలించే ప్ర‌ధాన ప‌ద‌వుల్లో సీఎం జ‌గ‌న్ సొంతవారిని పెట్టుకున్నారని ఆయ‌న అన్నారు.

నిధులు లేని, అప్ర‌ధాన ప‌దవులు బ‌డుగు వ‌ర్గాలకు కేటాయించారని ఆయ‌న మండిప‌డ్డారు. ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారుల పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌లు దుబారా చేస్తోంద‌ని ఆయ‌న మ‌ర్శించారు. ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల పేరుతో దోపిడీకి సిద్ధ‌మ‌య్యారని ఆయ‌న చెప్పారు.

ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రాసి, రాచ‌రిక వ్య‌వ‌స్థ‌ను విస్త‌రిస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. కాగా, ఏపీలో ప‌లు కార్పొరేషన్లు, అకాడమీలు, సమాఖ్యలు, ఆర్టీసీ ప్రాంతీయ బోర్డులు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీసీసీబీ, జిల్లా గ్రంథాలయ సంస్థలు వంటి వాటి ఛైర్మన్ల జాబితాను స‌ర్కారు వెల్లడించిన విష‌యం తెలిసిందే. మొత్తం 137 సంస్థలకు ఛైర్మన్లను నియమించింది.



More Telugu News