జగనన్న కాలనీలకు కేంద్ర నిధులు కోరడమేంటి?: జగన్‌పై జీవీఎల్ ఫైర్

  • కేంద్ర సంక్షేమ పథకాలను జగన్ తనవిగా చెప్పుకుంటున్నారు
  • ప్రాజెక్టులపై పెత్తనం రాష్ట్ర ప్రభుత్వాలదే
  • తెలంగాణ మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు కేంద్ర నిధులు కోరడం విడ్డరంగా ఉందన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జీవీఎల్.. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఉండదని, అవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయన్నారు. నదీ యాజమాన్య బోర్డులకు హక్కులు కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేస్తే తెలంగాణ మంత్రులు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ కాలనీలకు కేంద్రం నిధులివ్వాలని జగన్ కోరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News