హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం
- తెలంగాణకు మరో మూడ్రోజులు వర్షసూచన
- భారీ వర్షంతో తడిసిముద్దయిన నగరం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రోడ్లపైకి నీరు.. ట్రాఫిక్ కు ఇబ్బందులు
తెలంగాణకు మరో మూడ్రోజుల వర్షాలు తప్పవని వాతావరణ విభాగం చెబుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాగోల్, కోఠి, నాచారం, హబ్సీగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, జియా గూడ, ఎల్బీనగర్, టోలీ చౌకి, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కాప్రా, సికింద్రాబాద్, తార్నాక, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఓయూ ఏరియా, ఉప్పల్, కోఠి ప్రాంతాల్లో వర్షం పడింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో, రోడ్లపై నీరు నిలిచింది. పలు చోట్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.