భూముల వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారు: రేవంత్ రెడ్డి ఆరోపణ

  • రానున్న రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారు?
  • చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయి
  • కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి
ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వ భూములను ఎందుకు విక్రయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయకుండా రాష్ట్ర సంపదను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ అమ్ముకుంటున్నారని... పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయని విమర్శించారు.

కోకాపేట భూముల వేలం వల్ల రూ. 2 వేల కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ తెలిపిందని.... అయితే ఆన్ లైన్ వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయని అన్నారు. ఆన్ లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తర్వారా ఆ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారు. వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారని రేవంత్ అన్నారు. ఐదు కంపెనీలు కలిసి రూ. వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టాయని మండిపడ్డారు.


More Telugu News