హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడంపై షర్మిల కీలక ప్రకటన
- హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయం
- ఉపఎన్నిక వల్ల ఎలాంటి ఉపయోగం లేదు
- పగ, ప్రతీకారం కోసమే ఉపఎన్నికలు వచ్చాయి
హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల... రాజకీయపరంగా దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కీలక ప్రకటన చేశారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అని అడిగారు. దళితులకు మూడెకరాల భూమి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని ప్రభుత్వం చెపితే తాము కూడా పోటీ చేస్తామని చెప్పారు. పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలే హుజూరాబాద్ ఉపఎన్నికలని అన్నారు.