'జోకర్' మళ్లీ వస్తోంది... ఫోన్లు భద్రం!
- ఇటీవల తరచుగా దాడి చేస్తున్న మాల్వేర్
- యాప్ ల ద్వారా ఫోన్లలోకి చొరబాటు
- వ్యక్తిగత వివరాల తస్కరణ
- జోకర్ మాల్వేర్ ను అప్ డేట్ చేసిన హ్యాకర్లు
టెక్ యుగంలో సాఫ్ట్ వేర్ లతో ఎంతటి ఉపయోగాలు ఉన్నాయో, వైరస్ లు, మాల్వేర్లతో అంతకు మించిన నష్టాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్ పేరు జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు... ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది! ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని విధాలుగా సమాచారాన్ని సేకరించి ఎక్కడో ఉన్న హ్యాకర్లకు పంపుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!
గత కొంతకాలంగా ప్లే స్టోర్ లోని యాప్ లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న గూగుల్ ఈ జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను తొలగిస్తోంది. నాలుగేళ్ల కాలంలో 1800 యాప్ లను గూగుల్ తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ దీని ఆగడాలకు అడ్డుకట్ట పడడంలేదు. హ్యాకర్లు జోకర్ మాల్వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్తగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. దాంతో దీన్ని గుర్తించడం నిపుణులకు కష్టమవుతోంది. సాఫ్ట్ వేర్ల తరహాలో ఈ ప్రమాదకర మాల్వేర్ లోనూ కొత్త వెర్షన్లు తీసుకువస్తుండడంతో, వాటికి విరుగుడు రూపొందించడానికి సైబర్ యోధులకు అధిక సమయం పడుతోంది. ఈలోపే జోకర్ కొత్త వెర్షన్ విజృంభిస్తోంది.
తాజాగా, ప్లేస్టోర్ లోని కొన్ని యాప్ లపై ఓ మాల్వేర్ దాడి చేస్తున్నట్టు గుర్తించిన సైబర్ నిపుణులు, మరింత లోతుగా పరిశోధించగా ఇది కొత్త జోకర్ పనే అని తేలింది. ఇది కెమెరా, ఫొటో ఎడిటింగ్, ప్రాసెసింగ్ యాప్ లు, మెసెంజర్ యాప్ లు, గేమింగ్ యాప్ లు, వాల్ పేపర్ యాప్ లు, ట్రాన్స్ లేషన్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని, వాటి ద్వారా ఫోన్లలోకి ప్రవేశిస్తోందని గుర్తించారు.
ఇది ఓ యాప్ పై దాడి చేయగానే, మొదటి యాప్ కోడ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం లేకపోతే మాల్వేర్ ఎలాంటి ప్రభావం చూపదు. యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం ఉంటే మాత్రం ఫోన్ యూజర్ వివరాలన్నీ తస్కరిస్తుంది. అందుకే, యూజర్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లతో ఫోన్లను స్కాన్ చేస్తుండాలని, యాప్ స్టోర్లలో ఆయా యాప్ ల రేటింగ్ లను బట్టి కూడా వాటి భద్రతను అంచనా వేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.