వ‌ర్సిటీల‌ విద్యా సంవ‌త్స‌రంపై యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

  • క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 1 నుంచి త‌ర‌గ‌తులు
  • ప్రవేశాల ప్ర‌క్రియ‌ సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలి
  • పరీక్షలను ఆన్ లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానాల్లో నిర్వహించుకోవ‌చ్చు
విశ్వ విద్యాల‌యాల‌ విద్యా సంవ‌త్స‌రంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కాలేజీలు తెరుచుకోవ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశంలో అన్ని వర్సిటీల ప‌రీక్ష‌లు, విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన యూజీసీ మార్గద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

ప్ర‌స్తుత‌ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాల ప్ర‌క్రియ‌ను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని చెప్పింది. అక్టోబరు ఒకటి నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌ని చెప్పింది. పరీక్షలను ఆన్ లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానాల్లో నిర్వహించుకోవ‌చ్చ‌ని తెలిపింది.
  


More Telugu News