హెచ్‌సీఏలో రాజీ కుదిర్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  • హెచ్‌సీఏలో ఇటీవల రచ్చకెక్కిన విభేదాలు
  • కవిత నివాసంలో అజర్, విజయానంద్ మధ్య రాజీ
  • రేపటి ఎస్‌జీఎం రద్దు
విభేదాలతో రచ్చకెక్కిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో రాజీ కుదిరింది. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకుని హెచ్‌సీఏ చీఫ్ అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది. గురువారం కవిత తన నివాసంలో అజర్, హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్, ఇతర సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత వారి మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం.

కవిత చొరవతో అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్‌వర్మను కొనసాగించేందుకు ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు అంగీకరించినట్టు హెచ్‌సీఏ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, రేపటి ఎస్‌జీఎంను అనుకోని కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు విజయానంద్ నిన్న ప్రకటించారు. అజర్‌తో రాజీ కారణంగానే ఎస్‌జీఎంను రద్దు చేసినట్టు సమాచారం.


More Telugu News