రంగంలోకి దిగిపోయిన 'విక్రమ్' మూవీ టీమ్!
- కమల్ సొంత మూవీగా 'విక్రమ్'
- కరోనా కారణంగా ఆగిన షూటింగ్
- మళ్లీ ఈ రోజున సెట్స్ పైకి
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
కమలహాసన్ కొన్ని ప్రయోగాలు చేయవలసి వచ్చినప్పుడు, తానే నిర్మాతగా మారుతూ ఉంటారు. అలాగే ఈ సారి ఆయన 'విక్రమ్' కథను ఎంచుకున్నారు. అయితే ఇది ప్రయోగాత్మకమైన కథ .. అంతే కాదు సాహసోపేతమైన నిర్ణయం కూడా. కథ అంతా కూడా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లేలో విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అందువలన ఈ సినిమా దర్శకత్వ బాధ్యలతలను కమల్ ఆయనకి అప్పగించారు. కమల్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజుల క్రితం రెగ్యులర్ షూటింగుకు వెళ్లింది. ఆ తరువాత కరోనా తీవ్రత పెరగడం వలన, షూటింగును ఆపేశారు. అలా వాయిదా పడిన షూటింగు, మళ్లీ ఈ రోజున మొదలైంది. ఈ సినిమా నుంచి వచ్చిన కాన్సెప్ట్ వీడియో, ఇదొక డిఫరెంట్ మూవీ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో నలుగురు ప్రతినాయకులు ఉంటారు. ప్రధానమైన ప్రతినాయకులుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.