సీఎం జగన్ ఆర్థికసాయం... ప్రకాశం జిల్లా ప్రభుత్వ వైద్యుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి
- ఏప్రిల్ లో కరోనా బారినపడిన డాక్టర్ భాస్కరరావు
- భాస్కరరావు కారంచేడు పీహెచ్ సీ వైద్యుడు
- ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన వైనం
- మార్చకపోతే ప్రాణహాని తప్పదన్న కిమ్స్ వైద్యులు
- సీఎం జగన్ 1.5 కోట్ల ఆర్థికసాయం
ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ ఎన్.భాస్కరరావు ఏప్రిల్ నెలలో కరోనా బారినపడడంతో ఆయన రెండు ఊపిరితిత్తులు పనికిరాకుండా పోయాయి. దాంతో ఆయన బతకాలంటే ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. అందుకు భారీగా ఖర్చు కానుండడంతో సీఎం జగన్ ఉదారంగా స్పందించి రూ.1.5 కోట్ల ఆర్థికసాయం మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతం అయినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఓ ప్రభుత్వ వైద్యుడి పరిస్థితి పట్ల పెద్ద మనసుతో స్పందించి, ప్రాణాలు కాపాడారంటూ సీఎం జగన్ ను వేనోళ్ల కొనియాడుతున్నారు.
డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం అయిన సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘానికి ఆమె ధన్యవాదాలు తెలుపుకున్నారు.