కార్య‌కర్త‌ల భుజాలపైకి ఎక్కి బారికేడ్లు దూకిన రేవంత్ రెడ్డి.. అరెస్ట్

  • ర్యాలీకి పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
  • చేసి తీరతామ‌న్న రేవంత్
  • అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌ కు తరలించిన పోలీసులు  
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్‌’కు పిలుపునివ్వ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొంటున్నాయి. హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసిన త‌ర్వాత కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ప‌లు చోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేశారు.

ఈ క్ర‌మంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య తోపులాట జ‌రిగి ప‌లువురు పోలీసులు కింద‌పడిపోయారు. అనంత‌రం, గవర్నర్‌ అందుబాటులో లేర‌ని, ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు రేవంత్ రెడ్డికి సూచించారు. తాము అంబేద్కర్‌ విగ్రహం వరకు తమ ర్యాలీ చేసుకుంటామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ఒప్పుకోక‌పోవ‌డంతో కార్యకర్తల భుజాల‌పైకి ఎక్కిన రేవంత్ రెడ్డి బారికేడ్లు దూకారు. దీంతో ఆయ‌న‌తో పాటు అక్క‌డ ఉన్న ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేష‌న్‌ కు తరలించారు.


More Telugu News