వ‌ర్షాల వేళ‌ పాత వీడియోలు వైర‌ల్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు: రాచకొండ సీపీ మ‌హేశ్ భగవత్

  • గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వర్షాలు
  • పాత వీడియోలు పోస్ట్ చేస్తోన్న నెటిజ‌న్లు
  • భారీ వరదలు వచ్చి, ఇళ్లు కూలిపోతున్నాయంటూ ప్ర‌చారం
  • కేసులు పెడ‌తామని పోలీసుల హెచ్చ‌రిక‌
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వర్షాలు కుర‌వ‌డంతో ప‌లు కాల‌నీలు, రోడ్లు జ‌ల‌మ‌య‌మైన విషయం తెలిసిందే. అయితే, కొంద‌రు ఈ సందర్భంగా పాత వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌యాన్ని పెంచుతున్నారు. నగరంలో భారీ వరదలు వచ్చాయని, ఇళ్లు కూలిపోతున్నాయంటూ పాత వీడియోలను కొత్త వీడియోలుగా చూపుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇటువంటి వారికి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. వీడియోల‌ను వైరల్‌ చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామ‌ని పేర్కొన్నారు. కాగా, వర్షాల కారణంగా ఎవ‌రైనా ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 100కు ఫోన్ చేసి చెప్పాల‌ని, సంబంధిత సిబ్బంది వెంట‌నే వ‌చ్చిన సాయం చేస్తార‌ని ఆయ‌న వివ‌రించారు. స‌హాయ‌క బృందాలు, పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని అన్నారు.


More Telugu News