సజ్జల ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి
- తనను సజ్జలకు ఓస్డీగా నియమించాలంటూ దశరథరామిరెడ్డి విన్నపం
- ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విషయమై తెలంగాణకు లేఖ
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి డిప్యుటేషన్‌పై తనను ఓస్డీగా నియమించాలంటూ తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ డి.దశరథరామిరెడ్డి ఈ ఏడాది జనవరి 20న తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుకున్న అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దశరథరామిరెడ్డి విన్నపం తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 11న ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
తాజాగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దశరథరామిరెడ్డి విజ్ఞప్తికి అంగీకరిస్తూ ఈ నెల 3న ఏపీకి తెలియజేసింది. ప్రభుత్వ అంగీకారం నేపథ్యంలో దశరథరామిరెడ్డిని సజ్జలకు ఓఎస్డీగా నియమిస్తూ నిన్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను వెంటనే రిలీవ్ చేసి చివరి వేతన చెల్లింపు ధ్రువపత్రంతోపాటు సర్వీసు రిజిస్టర్‌ను ఏపీ సాధారణ పరిపాలన శాఖలో సమర్పించాలని తెలంగాణ హోంశాఖను ఆ ఉత్తర్వుల్లో కోరారు.