విజయవాడ విమానాశ్రయంలో అందుబాటులోకి కొత్త రన్‌వే.. కోడ్-ఈ హోదా!

  • 3,360 మీటర్ల పొడవున్న నూతన రన్‌వే
  • భారీ విమానాల రాకపోకలకు మార్గం సుగమం
  • నూతన రన్‌వేపై ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
విజయవాడ విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే అందుబాటులోకి వచ్చింది. నిన్న ఉదయం అధికారులు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఫలితంగా ఈ విమానాశ్రయానికి కోడ్-ఈ హోదా లభించింది. నూతన రన్‌వే అందుబాటులోకి రావడంతో ఇకపై ఇక్కడి నుంచి బోయింగ్ 737, 747 వంటి భారీ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఢిల్లీ నుంచి నిన్న ఉదయం 7.10 గంటలకు విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం.. 3,360 మీటర్ల పొడవైన ఈ రన్‌వేపై ల్యాండ్ కావడంతోనే ఇది అందుబాటులోకి వచ్చినట్టు విమానాశ్రయ డైరెకర్ మధుసూదనరావు తెలిపారు. కాగా గతంలో ఈ రన్‌వే 2286 మీటర్ల పొడవు మాత్రమే ఉండేది.


More Telugu News