వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెలంగాణతో జలవివాదం: టీడీపీ

  • చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన పొలిట్ బ్యూరో
  • కావాలనే తెలంగాణతో జల వివాదం
  • కలిసి భోజనం చేసినప్పుడు ఉన్న సఖ్యత ఇప్పుడెందుకు లేదని ప్రశ్న
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన టీడీపీ  పొలిట్ బ్యూరో సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నేతలు ధ్వజమెత్తారు. భిన్న ధ్రువాలుగా ఉండే కేసీఆర్, చంద్రబాబు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తలెత్తని జల వివాదం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో జగన్ సర్కారు కావాలనే గొడవలు పెట్టుకుంటోందని ఆరోపించారు. ఈ వివాదంలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కనిపించడం లేదన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి భోజనాలు చేశారని, ఉమ్మడి శత్రువును ఓడించామని సంబరపడినప్పుడు ఉన్న సఖ్యత ఇప్పుడెందుకు లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ రాత్రుళ్లు మాట్లాడుకుని, పగలు ఉత్తర్వులు ఇస్తారని నేతలు ఆరోపించారు.


More Telugu News