పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మృతి

  • ఏడాదిన్నర కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న హుస్సేన్
  • కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • 1940లో భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన హుస్సేన్
ఏడాదిన్నర కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ నేత అయిన హుస్సేన్ కరాచీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ధ్రువీకరించారు. భారతదేశంలోని ఆగ్రాలో 1940లో జన్మించిన ఆయన 2013 నుంచి 18 వరకు పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా ఉన్నారు.


More Telugu News