రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై స్పష్టత నిచ్చిన శరద్ పవార్
- రాష్ట్రపతి పదవి రేసులో లేనని తేల్చేసిన శరద్ పవార్
- పార్లమెంటులో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ
- ఎన్డీయే అభ్యర్థికే గెలుపు అవకాశాల నేపథ్యంలో వెనక్కి?
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున బరిలోకి దిగబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండుసార్లు శరద్ పవార్‌తో భేటీ కావడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పవార్ ఇటీవల భేటీ కావడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.
ఇటీవల ఈ వార్తలు మరింత జోరందుకోవడంతో శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్డీయేకు కావాల్సిన మెజారిటీ ఉండడంతో ఆ కూటమి నుంచి బరిలోకి దిగే అభ్యర్థే గెలిచే అవకాశం ఉంటుందని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. కాబట్టి పవార్ బరిలోకి దిగే అవకాశం లేదని స్పష్టం చేశాయి.