చిక్కుతున్న పులస చేపలు.. రూ. 6 వేలతో ప్రారంభం!
- ఈ సీజన్‌లో ప్రారంభమైన పులస చేపల రాక
- యానాంలో జాలర్లకు చిక్కిన పులస
- గతేడాది గరిష్ఠంగా రూ. 18 వేలు పలికిన వైనం
జీవితంలో ఒకసారైనా రుచి చూడాలని మాంసాహార ప్రియులు కోరుకునే పులస చేపల రాక ఈ సీజన్‌లో ప్రారంభమైంది. దీని రుచి ముందు మిగతా చేపల రుచి దిగదుడుపే. అందుకే దీని ధరలు ఆకాశంలో ఉంటాయి. గతేడాది పులస చేప ధర గరిష్ఠంగా రూ. 18 వేలు పలికింది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల వరదనీరు సముద్రంలోకి వెళ్లడం మొదలవుతుంది. ఈ క్రమంలో మట్టితో కూడిన నీటి రుచికి పులస చేపలు సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తాయి.
ఇవి గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి నదుల్లో ప్రయాణిస్తూ ధవళేశ్వరం బ్యారేజే గేట్ల ద్వారా భద్రాచలం వరకు ఎదురీదుతూ వెళ్తాయి. వరద నీటికి ఎదురీది వెళ్లడం వల్లే వీటికి ఇంత రుచి వస్తుందని చెబుతారు. సంతానోత్పత్తి కోసం వెళ్తూ మార్గమధ్యంలో జాలర్లకు చిక్కుతుంటాయి. నిన్న యానాంలో గౌతమి గోదావరిలో చిక్కిన ఓ చేపకు రూ. 6 వేల ధర పలికింది. ఈ చేప కిలోకు పైగా బరువు ఉన్నట్టు చేపను విక్రయించిన మహిళ పొన్నమండ రత్నం తెలిపింది.