టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందం అధికారిక గీతాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
- ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
- ఈ నెల 17న భారత అథ్లెట్లు జపాన్ పయనం
- అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు చీర్4ఇండియా పాట
- స్వరాలు సమకూర్చిన ఏఆర్ రెహమాన్
ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ నెల 17న భారత క్రీడాకారుల తొలి బృందం టోక్యో పయనం కానుంది. ఈ నేపథ్యంలో, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందం అధికారిక గీతాన్ని నేడు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరించారు. "హిందూస్థానీ వే..." అనే ఈ ఉత్సాహభరిత గేయానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు.