విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ట్రైలర్ విడుదల
- శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా
- భూమి కోసం పోరాటం చేస్తోన్న కుటుంబం
- అలరిస్తోన్న వెంకటేశ్ డైలాగ్
- ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల
విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'నారప్ప' సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన 'అసురన్' సినిమాకి రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని ఫైట్ సీన్లను ఈ ట్రైలర్‌లో అధికంగా చూపించారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. భూమి కోసం పోరాటం చేస్తోన్న కుటుంబంగా ఈ సినిమాలో నారప్ప ఫ్యామిలీ భావోద్వేగాలను పండించినట్లు తెలుస్తోంది.
'మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు... కానీ, చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు' అంటూ వెంకటేశ్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కూడా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.