బినామీల పేరుతో లక్షల కోట్లు ఆర్జించిన నారా లోకేశ్ నేడు రంకెలు వేయడం సిగ్గుచేటు: మంత్రి బాలినేని
- టీడీపీ ప్రభుత్వ హయాంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు
- లేటరైట్ ఇవాళ బాక్సైట్ అయ్యిందా?
- మా ప్రభుత్వం లేటరైట్ తవ్వకాలకు అనుమతులు కొత్తగా ఇవ్వలేదు
- అప్పట్లో లేటరైట్ ను వ్యతిరేకించిన గిరిజనులపై అక్రమ కేసులు
గత టీడీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. లేటరైట్ తవ్వకాలకు గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ఆయన చెప్పారు.
'టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చిన లేటరైట్ ఇవాళ బాక్సైట్ అయ్యిందా? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లేటరైట్ తవ్వకాలకు అనుమతులు కొత్తగా ఇవ్వలేదు. బినామీల పేరుతో లక్షల కోట్లు ఆర్జించిన నారా లోకేశ్ నేడు రంకెలు వేయడం సిగ్గుచేటు' అని ఆయన విమర్శించారు.
'టీడీపీ ప్రభుత్వంలో లేటరైట్ ను వ్యతిరేకించిన గిరిజనులపై అక్రమ కేసులు, హత్యాహత్నం చేయించింది అయ్యన్న అనుచరులు కాదా? అయ్యన్న బినామీ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వం ఫైన్ వేసింది నిజం కాదా?' అని బాలినేని శ్రీనివాసరెడ్డి నిలదీశారు.