నటుడు మురళీమోహన్ కు సుప్రీంకోర్టులో వ్యతిరేక ఫలితం

  • జయభేరి సంస్థ నుంచి ఫ్లాట్ కొన్న మధుసూదన్
  • అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వైనం
  • సుప్రీంకోర్టులో నేడు విచారణ
  • మధుసూదన్ కు అనుకూల తీర్పు
ఓ ఫ్లాట్ వివాదంలో సినీ నటుడు మురళీ మోహన్ కు సుప్రీంకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చింది. హైదరాబాదుకు చెందిన మధుసూదన్ అనే బిజినెస్ మేన్ మురళీమోహన్ కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి కొండాపూర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు.

అయితే ఫ్లాట్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ మధుసూదన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హెచ్ఎండీఏ నిబంధనలు ఉల్లంఘించినట్టు మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధుసూదన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. జయభేరి తరఫు వాదనలను కోర్టు తోసిపుచ్చింది.


More Telugu News