రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్

  • భేటీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
  • ఈ భేటీపై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ
  • తృతీయ కూటమి ఏర్పాటు గురించి చర్చించారా? అనే సందేహాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సీఎం అమరీందర్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పంజాబ్ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నారా? లేక జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలనే కోణంలో భాగంగా కలిశారా? అనే చర్చ జరుతుతోంది. ఈ భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News