ఆసక్తిని రేపుతున్నఆర్య 'సర్పట్ట' ట్రైలర్
- బాక్సింగ్ నేపథ్యంలో 'సర్పట్ట'
- ఆర్య భార్య పాత్రలో దుషారా విజయన్
- అమెజాన్ లో ఈ నెల 22న రిలీజ్
- ఈ సినిమాపై ఆర్య ఆశలు
ఆర్య కథానాయకుడిగా తమిళంలో రూపొందిన చిత్రమే 'సర్పట్ట' .. 1980లలో నడిచే కథ ఇది. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, దుషారా విజయన్ కథానాయికగా నటించింది. 'కబాలి' .. 'కాలా' సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కథానాయకుడి నేపథ్యం .. ఆయన బాక్సర్ గా మారడం .. రాణించడంపై ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 80వ దశకం నాటి కథ కావడంతో, అప్పటి వేషధారణ .. హెయిర్ స్టైల్ ను చూపించడం చాలా కష్టం. కానీ దర్శకుడు పా రంజిత్ ఆ విషయంలో చాలా శ్రద్ధ పెట్టినట్టుగానే కనిపిస్తున్నాడు. పశుపతి .. అనుపమ నటరాజన్ .. సంచిత నటరాజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై ఆర్య గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.